అప్పన్నకు కేజి చందనం సమర్ఫణ..
Ens Balu
3
Simhachalam
2021-08-08 04:24:14
విశాఖలోని శివాజీ పాలెంకు చెందిన కె. ఉమామహేశ్వరరావు కుటుంబం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారికి కేజీ చందనం సమర్పించింది. ఈమేరకు ఆదివారం తనపేరుతో అరకేజీ చందనం (రూ.10,116) తన కుమార్తె కె. వైజయంతి పేరుమీద అరకేజీ చందనం (రూ.10,116) సమర్పించారు. వారికి స్వామివారి ప్రసాదంగా రెండు చందనపు చెక్కలను ఏఈఏ రాఘవకుమార్ అందించారు. అనంతరం దాతలకు దేవలాయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా లేదా డైరెక్టుగా వచ్చి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించవచ్చని ఏఈఓ తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా సమర్పించే భక్తులకు, పోస్టల్ లో ప్రసాదం పంపిస్తున్నామన్నారు. ఈ అవవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.