లక్ష్యానికి మించి కోవిడ్ వేక్సినేషన్..


Ens Balu
3
విశాఖపట్నం
2021-08-08 07:26:50

దేశంలో జూలై నాటికి లక్ష్యానికి మించి కోవిడ్ వాక్సినేషన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఉదయం  చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం లో జరుగుచున్న వాక్సినేషన్ పక్రియను ఆమె పరిశీలించారు.  జిల్లా కలక్టరు ఎ.మల్లిఖార్టున జిల్లాలో వాక్సినేషన్ ప్రకియ, వివరాలను మంత్రికి  తెలియజేసారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయటం జరిగిందని, వారిలో 1కోటి 74లక్షల మందికి మొదటిడోసు మిగిలినవారికి రెండు డోసులు వేయడమైనదని, జిల్లాలో 22 లక్షల మందికి వాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటి డోసు, 5 లక్షల మందికి రెండు డోసులు వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు.  ఈ సంధర్బంగా కేంద్ర ఆర్దికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50కోట్ల మందికి వాక్సిన్ అందించినట్లు తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమం  ప్రణాళిక ప్రకారం జరుగుతుందన్నారు. దీనివలన క్రమపద్దతి ఏర్పడుతుందని, ప్రజలలో నమ్మకం కలుగుతుందన్నారు.తద్వారా ఆర్థికాభివృద్దికి తోడ్పడుతుందన్నారు . వాక్సినేషన్ కు అయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్నదని తెలిపారు. రానున్న రెండు నెలలలో వాక్సిన్ల సరఫరా పెరుగుతుందని, దానికొరకు దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు,  విదేశీ వాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.  మొదట ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పోలీసులకు, పారామిలటరీ, సైన్యానికి అందించామని, తరువాత 65 సంవత్సరములు, దీర్ఝకాల వ్యాదిగ్రస్తులకు, తదుపరి 45 సంవత్సరాలు దాటిన వారికి అందజేసారని ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి శతశాతంతోపాటు 18 సంవత్సరాలు నిండిన గర్బిణీలకు, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు, ఉపాద్యాయలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వాక్సిన్ అందిస్తామన్నారు.  వాక్సినేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేయుటంద్వారా  పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, రాజ్యసభసభ్యులు జి.వి.ఎల్. నరశింగరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ అధికారులు పాల్గొన్నారు.