స్థానిక వస్త్రాలు బ్రాండింగ్ చేసి ఖ్యాతి గడిద్దాం..


Ens Balu
2
Srikakulam
2021-08-08 10:29:03

శ్రీకాకుళంజిల్లాలో తయారు అవుతున్న వస్త్రాలకు బ్రాండింగ్ చేద్దామని,  తద్వారా ఖ్యాతి గడిద్దామని జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో ఉన్న చేనేత సహకార సంఘాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆది వారం కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన డిజైన్లు తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపు నిచ్చారు. మార్కెటింగ్ పై అధిక దృష్టి సారించాలని, బ్రాండింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బ్రాండ్ కచ్చితంగా ఉండాలని తద్వారా వస్త్ర వ్యాపారం వికసిస్తుందని తెలిపారు. బ్రాండ్ ఉన్న వస్తువుల పట్ల ప్రజలు మొగ్గు చూపడం జరుగుతుందని గ్రహించాలని సూచించారు. బ్రాండ్ పై పేటెంట్ తీసుకుందామని చెప్పారు. మార్కెటింగ్ కు పక్కాగా బిజినెస్ ప్లాన్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక వెబ్ పోర్టల్ లో పెట్టి బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని ఆయన అన్నారు. జిల్లాలోనే ముందుగా గిరాకీ ప్రారంభించాలని ఆయన సూచించారు. జిల్లాలో  రెడీ మేడ్ దుస్తుల తయారు  చేయటం జరగాలని ఆయన అన్నారు. చేనేటకారులు స్వయం సమృద్ది సాధించే దిశగా అడుగులు పడాలని ఆయన పేర్కొన్నారు. అందుకు గల ప్రతి అవకాశాన్ని సద్వనియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సూచించిన విధంగా చేనేతకారుల సంఖ్య కనీసం 50 శాతం పెరగాలని అందుకు అవసరమగు శిక్షణా కార్యక్రమాలు, ముడిసరుకు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ జి. రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎస్ కె అబ్దుల్ రశీద్, చేనేత సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.