సోమవారం శ్రీకాకుళం వస్త్రాలు ధరించాలి..
Ens Balu
2
Srikakulam
2021-08-08 10:33:16
ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లాలో ఉత్పత్తి అయిన వస్త్రాలు ధరించేందకు చర్యలు తీసుకుంటామని జిల్లా శ్రీకేష్ లాఠకర్ కలెక్టర్ తెలిపారు. చేనేత సంఘాల ప్రతినిధులు కె.రవి, మావూరి గణపతి రావు, వట్టం శ్రీనివాసరావు, గుత్తి అప్పారావు , ఎం. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కొద్ది నైపుణ్యం, నైపుణ్యం లేని చేనేతకారులు ఎక్కువగా ఉన్నారన్నారు. సొసైటీ ఎన్నికలు జరగక పోవడం కూడా సంఘాలకు సహాయ సహకారాలు అందడంలో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. చేనేత కార్మికులకు నూలు అందించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. చేనేత వస్త్రాలకు వినియోగదారులు వస్తున్నారని కానీ పవర్ లూమ్ లో తయారు వస్త్రాల వలన ధరలలో వ్యత్యాసాలు వలన నష్టం జరుగుతోందని వివరించారు. వస్త్రాలకు ప్రభుత్వ రిబెట్ లేకపోవడం, 3 సంవత్సరాలుగా త్రిఫ్ట్ ఫండ్ లేకపోవడం సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఎం.ఎల్.ఏ ధోతిలు శ్రీకాకుళంలో తయారు అవుతున్నాయని వివరించారు. వస్త్రాలకు సరైన ప్యాకింగ్ ఉండాలని, అప్కో వెంటనే చెల్లింపులు చేయాలని, ప్రతి సంఘానికి ఒక మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ జి. రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎస్ కె అబ్దుల్ రశీద్, చేనేత సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.