నాడు-నేడుతో పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు


Ens Balu
4
Pulletikurru
2021-08-08 16:07:45

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి-నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యావ్యవస్థలో సత్ ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వెల్లడించారు.  ఆదివారం పీ.గన్నవరం నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, అంబాజీపేట, పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మనబడి-నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ సి.హరికిరణ్ స్థానిక శాసనసభ్యులు కొండేటి. చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ తో కలిసి  పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 1,100 పాఠశాలలో  మొదటి దశ మనబడి-నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు సంతృప్తికర స్థాయిలో జరిగాయన్నారు. వీటిని శని,ఆదివారలలో రంపచోడవరం , రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్ లో పర్యటించి పరిశీలించడం జరిగిందన్నారు. నాడు నేడు పనుల వలన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం ద్వారా ప్రభుత్వ పనులు తీరుకు అద్దంపడుతుందన్నారు. ఇదే తరహాలో రెండో విడత నాడు-నేడు పనుల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నాడు నేడు పనులను ప్రభుత్వ వనరులతో పాటు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం శుభసూచకమన్నారు.ఈ విధంగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిదిలో ఉన్న  పాఠశాలలో  సమారుగా రూ.60 నుంచి 70 లక్షలు వెచ్చించి పాఠశాలలను అభివృద్ధి పరచుకోవడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అదే తరహాలో పాఠశాల ఆట స్థలాలను మెరుగుపరుచుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో వాస్తు ప్రకారం అన్ని పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రాధాన్యత అంశాలైన వైద్య ఆరోగ్యంతోపాటు విద్య పట్ల కూడా అధిక ప్రాముఖ్యత ఇవ్వడం నాడు నేడు పనులే నిదర్శనమని కలెక్టర్ అన్నారు.ఆగస్టు16న మనబడి నాడు నేడు రెండవ దశ పనులు ప్రారంభోత్సవంతో పాటు జగనన్న విద్యా కానుక 2020-21 ప్రారంభోత్సవ పనులకు సన్నద్ధమవుతున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ మీడియాకు వివరించారు.మనబడి -నాడు నేడు  కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన పీ. గన్నవరం , పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, ఫర్నేచర్, వంటశాల, త్రాగు నీరు, టాయిలెట్స్ , వాల్ పెయింటింగ్స్ , డిజిటల్ క్లాస్ రూమ్ లను ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో కలిసి  పరిశీలించారు.   ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.అబ్రహం, ఎస్ఎస్ఎ పీవో బి.విజయబాస్కర్,అమలాపురం ఆర్డీవో ఎస్ఎస్. వసంతరాయుడు,డీడీవో శాంతామణి ,ఎంపీడీవో ఐఇ. కుమార్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.