మహాత్మాగాంధీ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని వక్తలు అభిప్రాయవడ్డారు. శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో “క్విట్ ఇండియా ఉద్యమం- ఎనిమిది దశాబ్ధాల చరితం' పేరిట స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడాకారులు, వాకర్స్, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జనార్థన నాయుడు మాట్లాడుతూ క్రిప్స్ రాయభారం విఫలం కావడంతో గాంధీ తీసుకున్న నిర్ణయమే క్విట్ ఇండియా ఉద్యమమన్నారు. సమాచారశాఖ ఏడీ ఎల్.రమేష్ మాట్లాడుతూ స్వతంత్ర్య పోరాటంలో అనేక ఘట్టాలు నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ ప్రయత్నం చేస్తున్న శక్తి, కొంక్యాన ట్రస్టు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. డిఎస్‌డిఒ బి. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్ర నేటి తరానికి తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ శాంతియుత పంథాలో మహాత్మాగాంధీ చేసిన పోరాటం దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎన్నో త్యాగాలు చేసిన సమరయోథుల కుటుంబాల్లో నిరుపేదలను ఆదుకొనేందుకు పాలకులు ముందుకు రావాలని శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ (సేవ) అధ్యక్షురాలు పైడి రజని అన్నారు. చట్టసభ సభ్యుల కుటుంబ సభ్యులుగా కంటే సమరయోథుల వారసులుగానే తన తండ్రి, భర్త, తాను గౌరవంగా భావిస్తామన్నారు. స్వతంత్ర్య సమరయోథుల కుటుంబాల్లో నిరుపేదలు, ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ప్రభుత్వపరంగా రావాల్సిన భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అటువంటి వారికి వేగవంతంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వాతంత్ర్య సమరయోథులు దివంగత గుడ్డ రమణమూర్తి కుమార్తె, రిటైర్డ్ ట్రెజరీ డి.డి తారాదేవి స్వాతంత్రోద్యమ ఘట్టాలను వివరించారు. తన తండ్రి ద్వారా సమరయోథులు దేశం కోసం పోషించిన పాత్ర గురించి తెలుసుకోగలిగానన్నారు. తొలుత ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి స్వాతంత్ర్య సమరయోథులు పైడి నరసింహ అప్పారావు, గుడ్ల రమణమూర్తి, బెవర అప్పలస్వామిదేవ్ కుటుంబ సభ్యులు పైడి రజని, పైడి గోపాలరావు, తారాదేవి, ఉమాశంకర్‌దేవ్ పూలమాలలు వేశారు. అనంతరం సమరయోథుల కుటుంబాలకు కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ టస్బు చైర్మన్ కొంక్యాన మురళీధర్, వాకర్స్ కబ్ గవర్నర్ గుప్త పూర్య గవర్నర్లు ఇందిరాప్రసాద్, కూన రమణమూర్తి, డిఎస్‌డిఒ శ్రీనివాస్‌కుమార్, ఆర్ట్స్ కళాశాల పి.డి. మోహన్‌రాజు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్.జోగినాయుడు, వి.వివేకానంద, భీమరాజు, వైకాపా నాయకుడు రొక్కం సూర్యప్రకాష్, ఎన్‌సిసి అధికారి పోలినాయుడు, రోటరీ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్, మహాత్మాగాంధీ మందిర రూపశిల్పి ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి, వివిధ క్రీడా విభాగాల కోచ్‌లు సత్కరించారు. వాకర్స్ క్లబ్ సభ్యుడు మల్లిబాబుకు జన్మదిన వేడుకలు తెలిపారు.