జగనన్న కాలనీలు వేగవంతం కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-08-09 14:10:18

జగనన్న కాలనీలు నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం డివిజన్ పరిధిలో అన్ని మండలాల మండల, డివిజన్ పరిధిలోని జగనన్న కాలనీల పై ఆయనతో పాటు శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాంశు కౌశిక్ లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో చేపడుతున్న హౌసింగ్ చాలా పెద్ద కార్యక్రమమని, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.  నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు దిశగా కృషి చేయాలన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి లబ్ధిదారులకు మేలుచేకూర్చాలన్నారు. ఎలక్ట్రికల్ లైనులు కూడా వేయాలి. నీరు ఉంటేనే పనులు త్వరితగతిన చేపట్టడానికి బోర్లు కూడా వేయాలని సూచించారు. ఇసుక, తదితర అంశాలపై వివరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో వంశధార నది ప్రవహిస్తున్పప్పటికీ జగనన్న కాలనీల నిర్మాణంలో ఇసుక కొరత తలెత్తుతుందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాంప్ కేటాయించ వలసినదిగా సూచించారు. జమ్మూ లే ఔట్ లో 600 ఇళ్లు నిర్మాణం జరుగుతోందని, నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిల్లాం లే ఔట్ గుండా 33కెవి విద్యుత్ లైను ఉందని, దానిని మార్చుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందరూ బాధ్యతగా పని చేస్తేనే విజయవంతం అవుతుందని, దీని కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరింత బాధ్యత గా పనిచేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గంలో పెద్ద లే ఔట్లు ఉన్నాయని, వాటికి సరిపడ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటుందని ఎస్ఇ ఇపిడిసిఎల్ ను ఆదేశించారు. ఇళ్లు లేని వారు ధరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరు చేయాలని, దీనిపై ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అవసరమైతే భూసేకరణ చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. మండలాల్లో లబ్ధిదారుల సంఖ్య పెంచాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ లే ఔట్ ల్లో చేయాల్సిన పనులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇసుక సమస్యలు రాకుండా చూడాలని మండలాల వారీగా సమీక్షించారు. అధికారులు మండలాల్లో సమన్వయంతో పనిచేయాలన్నారు. 700 లే ఔట్లు ఉన్నాయని, వీటిలో ఎక్కడెక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయో గుర్తించి ఫోల్స్ ఎక్కడైనా అవసరమైతే డిఇల నుండి జాబితా తీసుకొంటే ఆ జాబితాను ఇపిడిసిఎల్ సిఎండి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఇపిడిసిఎల్ ఎస్ఇని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు ఋణాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఎంత మందికి కావాలో లబ్ధిదారులుతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సరఫరా కు సంబంధించి లేఔట్లు డిపిఆర్ అందజేయాలని ఎస్ఇ ని ఆదేశించారు. మండలాల వారీగా బోర్లు పై సమీక్షించారు. గృహాలు నిర్మాణాలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులకు సిమెంట్ సరఫరా పై ఎఇలు చర్యలు చేపట్టాలని, గొడౌన్లు లేకపోతే ప్రభుత్వ భవనాలు ఉంటే వాటిలో నిల్వ ఉంచాలన్నారు.

మండలాల వారీగా ఎన్ని పట్టాలు కోసం దరఖాస్తులు వచ్చాయో తెలియజేసి వారికి పంపిణీ కి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు చెప్పారు.  లే ఔట్ ల్లో సమస్యలు ఉంటే తెలియజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) హిమాంశు కౌశిక్ చెప్పారు.  మెగా హౌసింగ్ మేళాలో ప్రారంభించిన గృహాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. హౌసింగ్ పీడీ జి. కూర్మినాయుడు, శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని హౌసింగ్ డిఇ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, ఎపిఇపిడిసిఎల్ ఇంజనీర్లు, ఎపిఎంలు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.