సచివాలయాల ద్వారానే సేవలందాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-08-09 15:36:48

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి వార్డు కోర్పరేటర్ ఉరుకూటి నారాయణరావుతో కలసి 3వ జోన్ 29వ వార్డులోని 1086117, 178, 179 సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండి ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్లో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని మేయర్ సూచించారు.