అనధికారంగా రోడ్డులపై నిలిపిన వాహనాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె 3వ జోన్ 25వ వార్డు పరిధిలోని సీతమ్మపేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. అనుమతి లేకుండా రోజుల తరబడి వాహనాలను రోడ్ల మీద పార్కింగు చేస్తున్నారని వాటిని వెంటనే తొలగించాలని లేదా వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్.ఎస్. ఏజెన్సీ వద్ద చెత్త పేరుకు పోయి ఉన్నందున ఆ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నెల జీతం ఆపాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. క్లాప్ పధకంలో భాగంగా శానిటేషన్ చేయు పద్దతులలో మార్పులు తీసుకురావాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. దుర్గా నగర్ వెనుక ఉన్న రోడ్డు సరిగా ఊడ్చడం లేదని, దుకాణాల వద్ద మూడు రంగుల చెత్త డాబాలు పె ట్ట లేదని, దుకాణాల యజమానులు చెత్తను కాలువలో వేస్తున్నందు వలన కాలువలు పేరుకు పోతున్నందున దుకాణాల యజమానులకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై అవగాహన కార్యక్రామాలు సరిగా జరగడం లేదని, ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని మలేరియా సిబ్బందికి సూచనలు చేశారు. మలేరియా పై అవగాహన కల్పించడం, త్రాగు నీరు, విధ్యుత్ దీపాలు, రోడ్లు శుభ్రం చేయడం, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, కార్యనిర్వహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ జగన్నాధం, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.