అర్జీలపై అలసత్వం ప్రదర్శించవద్దు..
Ens Balu
4
GVMC office
2021-08-09 15:46:22
మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలు డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి నివేదించిన అర్జీలపై అలసత్వం ప్రదర్శిచవద్దని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధికారులకు సూచించారు. సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో 26 మంది నుంచి ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె జివిఎంసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు “స్పందన” కార్యక్రమం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి నిర్వహించారు. డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 02, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 09, ఏడవ జోనుకు 04, ఎనిమిదవ జోనుకు 03, ఇతరులు 01, మొత్తము 26 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, సిటీ ప్లానర్ ప్రభాకర్, డి.సి.పి. నరేంద్ర, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, రాజా రావు, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.