జివిఎంసీ స్పందన 41 ఫిర్యాదులు..


Ens Balu
5
GVMC office
2021-08-09 15:47:46

జివిఎంసీలో సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో ప్రజల నుండి  41 అర్జీలు వచ్చినట్టు మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. వాటినినేరుగా వివిధశాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపినట్టు ఆమె వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని అన్ని సచివాలయాల్లోనూ స్పందన జరిగేలా చూడాలని, ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జివిఎంసీ ప్రధాన కార్యాలయం వరకూ రాకుండా చేయాలని కమిషనర్ డా.జి.స్రిజనకు సూచించారు. అనంతరం వార్డుల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను వివరించారు. ఒకటవ జోనుకు 01, రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 12, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 03, ఆరవ జోనుకు 04, ఎనిమిదవ జోనుకు 03, మెయిన్ ఆఫీసు నకు 12, మొత్తము 41    ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, సిటీ ప్లానర్ ప్రభాకర్, డి.సి.పి. నరేంద్ర, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, రాజా రావు, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.