పీఏసీకి విజయసాయిరెడ్డి ఎంపికపై హర్షం..


Ens Balu
10
Visakhapatnam
2021-08-10 13:21:06

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీ  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల జిసిసి చైర్మన్ డా.శోభాస్వాతీ రాణి హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు, పథకాల్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఎంపిక పార్టీలోని అన్ని విభాగాలకు ఆనందం కలిగించే విషయమన్నారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పదవులు అదిరోహించాలని ఆకాంక్షించారు.