బీఎల్ఓలు కీలకంగా వ్యవహరించాలి..


Ens Balu
2
Parvathipuram
2021-08-10 13:35:10

ఓటరు జాబితా తయారు చేయడంలో బి.ఎల్. ఓ లు కీలకం పాత్ర పోస్తూ.. ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం మండల బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్ లతో  ఐ.టి.డి.ఎ  గిరిమిత్ర సమావేశ  ప్రాజెక్ట్ అధికారి స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR-2022) నిర్వహణ నిమిత్తం సమావేశం నిర్వహించారు. ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ నవంబర్1, 2021 డ్రాఫ్ట్ పబ్లికేషన్, జనవరి 5, 2022 ఫైనల్ పబ్లికేషన్ అన్నారు. నవంబర్1,2021 నుండి నవంబర్30, 2021 క్లైములు , అభ్యంతరాలు స్వీకరణ కార్యక్రమం అన్నారు. అందరూ బి.ఎల్.ఓ లు కీలక పాత్ర పోషించాలనీ, ఎటువంటి పొరపాట్లు జరగ కుండా చూసుకోవాలని సూచించారు. విధులు నిర్వహణలో ఎటువంటి సందేహాలు ఉన్న అడిగి తెలుసుకోవాలన్నారు.  ఈ సమావేశానికి పార్వతీపురం తహశీల్దార్ ఎన్.వి.రమణ, ఎన్నికల ఉప తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, బి. ఎల్.ఓలు, సూపర్వేజర్లు తదితరులు పాల్గొన్నారు.