కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మహావిశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వంశీ విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు, పథకాల్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఆయన ఎంపిక పార్టీలోని అన్ని విభాగాలకు ఆనందం కలిగించే విషయమన్నారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పదవులు అదిరోహించాలని ఆనందం వ్యక్తం చేశారు.