లక్ష కుంకుమార్చనకు భారీ ఏర్పాట్లు ..


Ens Balu
2
Simhachalam
2021-08-10 14:37:09

సింహాచలం  శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి ఆలయంలో శ్రావణశుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ నెల (శ్రావణమాసం 13న శుక్రవారం)  మొదటి శుక్రవారం లక్ష కుంకుమార్చన జరపడం ఆనవాయితీగా వస్తోంది.  20, 27, సెప్టెంబర్ 03న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లతాయారు సన్నిదిలో ఈ లక్షకుంకుమార్చన జరుపుతున్నట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొనే అవకాశం ఉందన్న ఈఓ ఇందుకోసం రూ.2,500 సాయంత్రం 5:30 గంటల నుంచి రూ.500 (ఐదువందలు) చెల్లించి సహస్రనామార్చనలో పాల్గొనే అవకాశం వుంటుందని తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా పాల్గొనదలచిన వారు దేవస్థానం అకౌంట్ కు అమౌంట్ , అడ్రస్, గోత్రనామాలు పంపించాలని సూచించారు. అంతేకాదు ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటలవరకు అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆమె తెలియజేశారు. శ్రావణమాసం సందర్భంగా సింహవల్లి  తాయార్ , ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసినట్టు ఈఓ వివరించారు. ఆన్ లైన్ పూజలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 6303800736 నంబర్ కు వాట్సప్ లేదా ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.