అప్నన్నకు డిసిసిబీ చైర్మన్ పూజలు..
Ens Balu
4
Visakhapatnam
2021-08-10 14:51:59
విశాఖ డీసీసీబీ ఛైర్ పర్సన్ చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు దంపతులు మంగళవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో అధికారులు చైర్మన్ కు దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం చైర్మన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కప్పస్ధంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసిసిబీ చైర్మన్ హోదాలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలతో డిసిసిబీ ద్వారా సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. తమకు ఈ పదవి రావడానికి కారణమైన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఇతన పార్టీ పెద్దలకు ధన్యవాదములు తెలియజేశారు. పూజలు అనంతరం వేద పండితులు ఆశ్వీరదాలు అందించగా, అధికారులు చైర్మన్ దంపతులకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు.