ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోపూజ‌..


Ens Balu
3
Tirumala
2021-08-10 16:23:28

తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న గోకులాష్టమి సందర్భంగా ఉదయం 10.30 గంటలకు 'గోపూజ మహోత్సవం' జరుగనుంది. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. కోవిడ్ -19  వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

సిఫార్సు