సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-08-10 16:32:44
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్ప్రేయింగ్, ఫాగింగు చేయించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన 6వ జోన్ 75వ వార్డు దొగ్గవాని పాలెం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ వార్డులో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని, మలేరియా సిబ్బంది వార్డులో ప్రతీ ఇంటిని సర్వే చేసి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగ్యూ కేసు నమోదైన ఇంటిలోను పరిసరాలను స్ప్రేయింగ్, ఫాగింగు దగ్గరుండి చేయించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలు డ్రైగా ఉండే ఉండే విధంగా చూడాలని, కాలువలోని చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో బయాలజిస్ట్ దొర, మలేరియా ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.