నాడు-నేడు పనులు పూర్తి చేయాలి..
Ens Balu
3
Srikakulam
2021-08-10 16:48:48
శ్రీకాకుళం జిల్లాలో నాడు - నేడు లో భాగంగా జిల్లాలో జరుగుచున్న ప్రభుత్వ పాఠశాలలో పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి కావలసిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నాడు – నేడు పనులపై జిల్లా అధికారులు, మండల విద్యాశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1220 పాఠశాలల్లో నాడు –నేడు పనలు ఉండగా 1138 పాఠశాలల్లో పనులు పూర్తయిందని, మిగిలిన పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి కావలసిందేనని అన్నారు. రాష్ట్రంలో నాడు నేడు పనులలో ప్రధమ స్థానంలో నిలవాలని అన్నారు. చిన్న పనులు పెండింగ్ వలన రాష్ట్రంలో 10వ స్థానంలో ఉన్నామని, యం బుక్, బిల్స్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం వలన రాష్ట్రంలో ప్రధమ స్థానంలో వెళతామని త్వరలో చిన్న పనులు పూర్తి చేసి ఆన్ లై న్ లో అప్ లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు. జిల్లాలో నాడు- నేడు పనులలో మిళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, పాలకొండ, సీతంపేట వెనకబడి ఉన్నాయని, మండల విదాశాఖాధికారి ఇతర సిబ్బందితో కలసి సమన్వయంతో పనిచేసి త్వరలో పని పూర్తి చేయాలని అన్నారు. పెయింటర్స్ సంఖ్యను పెంచి పని గంటలు పెంచుకోవడం ద్వారా ఒక ప్రణాళిక బద్దంగా పని చేస్తే ఆగస్టు 15 నాటికి 100 శాతం పెయింటింగు పనులు పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. స్కూల్ తెరిచేనాటికి నాడు-నేడు పనులతో ఎంతో ఆహ్లదంగా చక్కగా తిర్చిదిద్దాలని, ఈ పనులను చూసి పిల్లలు వాలు తల్లి దండ్రులు సంతోషించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, మండల విద్యాశాఖాధికారులు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.