మిరల్ ఫండ్స్ పనులు వేగం పెంచాలి..
Ens Balu
3
Srikakulam
2021-08-10 16:49:38
శ్రీకాకుళం జిల్లా మినరల్ పండ్స్ పనులు వచ్చే శుక్రవారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా మినరల్ ఫండ్ తో చేపడుతున్న పనులకు సమీక్షించారు. వారం రోజులలో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 487 పనులకు గాను 210 పనులు ఇంకా ప్రాంభంకాలేదని త్వరితగతిన ప్రారంభించాలని అన్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ చేపడుతున్న 291 పనులలో 76 పనులు మాత్రమే పూర్తి అయిట్లు , మిగిలిన పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలు వచ్చే సమావేశంలో పూర్తి వివరాలతో తెలపాలని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపొవడానికి గల కారణాలు తెలపాలని అన్నారు. పనులలో రద్దు చేసిన పనులు , ప్రారంభించిన పనుల వివరాలు తెలపాలని అన్నారు. టెక్కలి డివిజనల్ లో నాలుగు పనులు పూర్తి అయ్యాయని మిగిలిన పనులు త్వరలో పూర్తి చేయాలని అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా 18 పనులు ఉండగా 12 పనులు జరుగుతున్నాయని మిగిలిన పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని తెలిపాలని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ, ఐసిడిఎస్ కి కేటాయించిన పనులు పూర్తి చేసుకున్నందుకు అభినందించారు. నీటిపారుదల శాఖ కేటాయించిన మొత్తం పనులలో రూ 7 కోట్లు పనులు పెండింగ్ లో ఉన్నవని , వాటిని పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్ బిల్స్ ఉన్నట్లైతే సి.ఎఫ్.యం.ఎస్ లో పొందుపర్చాలని తెలిపారు. ఖర్చు పెట్టె ప్రతీ ఒక్కరూపాయికి బిల్స్ ఆన్ లైన్ లో పొందుపర్చాలని ఆయన తెలిపారు. కేటాయించిన పనులలో ఏవైనా రద్దు చేసి ఉంటే , ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తి వివరాలు తెలిపాలని అన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పి.ఓ పి.శ్రీధర్, మైనింగ్ అధికారులు, సర్వ శిక్షా అభియాన్ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.