కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రేషన్ కార్డు దారులు ఆధార్ e–KYC నమోదు ప్రక్రియ తప్పని సరిగా ఈ నెల 31 వ తేది లోపు పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 11,67,624 కార్డులకు గాను 5,04,000 కార్డులకు e–KYC నమోదు కావలసి ఉందన్నారు. రైస్ కార్డు దారులు సంబందిత వాలంటీర్ల ద్వారా పౌర సరఫరాల శాఖ వారి AEPDS మొబైల్ యాప్ నందు ఆధార్ e–KYC నమోదు చేసుకోవాలన్నారు. సమీప చౌకదరల దుకానం నందు గల e–PoS మిషన్ నందు గల e–KYC నమోదు ఆప్షన్ వినియోగించి కూడా ఆధార్ e–KYC పూర్తి చేసుకోవచ్చునని తెలిపారు. ఎవరైనా వృద్దులు లేదా రోజు వారి కూలీ పనులు చేసుకునే వారి వేలి ముద్రలు సరిగా నమోదు కాని ఎడల E-POS మిషన్ నందు గల ఫ్యూజన ఫింగర్ ఆప్షన్ వినియోగించి నమోదు చేసుకోవచ్చునన్నారు. ఒక వేల ఎవరికైనా ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ నందు కూడా వేలి ముద్రలు సరిగా నమోదు కాని యెడల వారు సమీప ఆధార్ నమోదు కేంద్రం నందు వేలి ముద్రలు మరలా నమోదు చేసుకొని e – KYC నమోదు ప్రక్రియను ఆగస్టు 31 లోపు పూర్తి చేసుకోవాలన్నారు. చిన్న పిల్లల ఆధార్ నమోదు చేసుకొను సమయం నందు వారి వేలి ముద్రలకు బదులుగా తల్లితండ్రుల వేలి ముద్రలతో వారికి ఆధార్ కార్డులు జారీ చేయడం జరిగి ఉంటే అట్టి వారి వేలి ముద్రలను ఆధార్ e–KYC నమోదు చేసుకొనుటకు ముందుగా ఆధార్ కేంద్రముల యందు నవీకరణ చేసుకున్న తరువాత ఆధార్ e–KYC నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఇటు వంటి వారికి మాత్రం సెప్టంబర్ మాసం చివరి వరకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా వ్యక్తుల లేదా సభ్యుల ఆధార్ సంఖ్య తప్పుగా నమోదై ఉంటే సరిచేసుకొనుటకు గ్రామ/ వార్డు సచివాలయం నందు వేసులు బాటు కల్పించడం జరిగిందని దానిని వినియోగించు కోవాల్సిందిగా సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణి వ్యవస్థలో ఆధార్ e–KYC నమోదు కాబడని సభ్యుల/ వ్యక్తుల e–KYC నమోదు ప్రక్రియను ఈ నెల 31 వ తేది లోపు సంబందిత వాలంటీర్ల ద్వారా పూర్తి చేయని ఎడల ఆ కార్డు దారులను బోగస్ సభ్యులుగా గుర్తించి వారికి సెప్టెంబర్ 2021 నెల నుండి నిత్యవసర సరుకులను నిలిపి వేయడం జరుగుతుందని, వారి పేర్లను రైస్ కార్డు నుండి తొలగించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ స్పష్టం చేశారు.