విద్యార్ధులూ.. పీజీ హాస్టళ్లు తెరిచే ఉన్నాయి..
Ens Balu
2
Vizianagaram
2021-08-12 13:08:10
విజయగరం జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరం సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలల అనుబంధ బీసీ హాస్టళ్లను తెరిచి ఉంచినట్లు కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ కారణంగా మూతపడిన వసతి గృహాలను పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా తెరిచి ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు విజయనగరం అర్బన్, రూరల్, బొబ్బిలి, పార్వతీపురం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులను లేదా కళాశాలల బీసీ వసతి గృహ సంక్షేమ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ స్ ష్టం చేశారు.