ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు..


Ens Balu
2
నిజామాబాద్
2021-08-12 13:15:07

 ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.  నిజామాబాద్ గ్రామంలో రూ. 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, బురవల్లి రూ.40 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయం గురువారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరులకు అవసరమైన సమాచారం లభించే విధంగా పరిపాలనలో మార్పులు చేయడం జరిగిందన్నారు. అందరికి ఉపయోగపడే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని పాలన అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సంక్షేమ పథకాలను మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్ లొనే పథకాలకు స0భంధించిన సొమ్ములను  ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ఉద్యోగాలను యువతకు కల్పించడమే కాకుండా ఆయా గ్రామ, వార్డుల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా  ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

          కార్యక్రమంలో సర్పంచ్ గంగు పద్మావతీ, సర్పంచ్ కాసులమ్మ,  స్పెషల్ ఆఫీసర్ గుత్తి రాజారావు, తాహసీల్ధార్ రామారావు, ఎంపిడివో రామ్ మోహన్, ఏవో ఉష కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ ఉప జెడ్పి చైర్మన్ మార్పు ధర్మ రావు, తదితరులు పాల్గొన్నారు.