పంద్రాగస్టును విజయవంతం చేయాలి..


Ens Balu
1
Guntur
2021-08-12 13:29:10

గుంటూరు జిల్లాలో ఆగస్టు 15 వ తేదిన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సంయుక్త కలెక్టర్(ఆసరా-సంక్షేమం) కె.శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని డి.ఆర్.సి సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్( ఆసరా-సంక్ష్మేమం) కె.శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షజరిగింది. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పెరేడ్ గ్రౌండ్ మైదానాన్ని అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలను విజయవతంగా నిర్వహించేందుకు విధులు కేటాయింపు చేసిన అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అతిధులు, అధికారులు, ప్రజలు వేడుకలను వీక్షించేందుకు   చక్కగా ఏర్పాట్లు చేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శించే శకటాలను ఆకర్షణీయంగా సిద్ధం చేయాలని, అలాగే స్టాళ్ళనూ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఒ కొండయ్య,గుంటూరు రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి,  జిల్లా పరిషత్తు సీఇఒ చైతన్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వినాయకం, గుంటూరు తూర్పు మండల తహాశీల్ధార్ శ్రీకాంత్, పశ్చిమ మండల తహాశీల్ధార్ మోహనరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.