గరుగుబిల్లి ఎంపిడిఓపై విచారణ..
Ens Balu
2
Garugubilli
2021-08-12 13:40:12
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలపరిషత్ అభివృద్ధి అధికారి జి.చంద్రరావు పై విచారణకు ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు. కార్యాలయంలోనే మద్యం సేవించినట్లు ఆయనపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి రాజ్‌కుమార్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ఎంపిడిపిపై తదుపరి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి స్పష్టంచేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయంలో మద్యం సేవించడం క్షమించరాని నేరమన్నారు. దేవాలయం లాంటి కార్యాలయంలో మద్యంసేవించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శమన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.