రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-12 15:37:15

కె.జి.హెచ్. లో  రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని, పరిసరాలన్నింటిని శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరు కె.జి.హెచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలను అధికం చేయాలని తద్వారా వచ్చే ఆదాయాన్ని కె.జి.హెచ్ అభివ్రద్దికి వినియోగించాలన్నారు. నాడు-నేడు క్రింద షిప్టు చేయాల్సిన శాఖలను రిలోకేట్ చేయడానికి రెండు ప్లాన్ లను సిద్దం గావించాలన్నారు. వైద్య పరికరాల మరమత్తులకు బిల్లులను చెల్లింపు కోసం పెట్టాలన్నారు. కె.జి.హెచ్ కు కొత్త ఎమ్.ఆర్.ఐ. స్కాన్ తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. వేస్ట్ డిస్పాజిల్ పై చర్చించారు. 
తదుపరి కలెక్టరు ఎవర్జెన్సీ వార్డు పరిశీలించి  డాక్టరుకు పలు సూచనలు చేశారు.  వార్డులలో పరిశుబ్రమైన ఆహాదకరమైన వాతావరణం ఉండాలన్నారు.  ఒపి ప్రవేశద్వారం వద్ద వీల్ చెయిర్ లు,  24 గంటలు అందుబాటులో ఉంచి, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వాసుపపల్లి గణేష్ కుమార్, జివిఎమ్ సి కమిషనర్ డాక్టర్ సృజన, కె.జి.హెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ వైధిలి,ఎపిఎమ్ ఎస్ ఐ సి ఇంజనీర్, ఎ.ఎమ్.సి .ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డిఎమ్ అండ్ హెచ్ఒ సూర్యనారాయణ తదితరులు పాల్గ్గొన్నారు.