విశాఖలో మెగా వేక్సినేషన్ డ్రైవ్..


Ens Balu
3
Visakhapatnam
2021-08-12 15:41:37

విశాఖ జిల్లాలో రేపు అన్ని ప్రభుత్వ పి.హెచ్.సి,  సి.హెచ్.సి.లలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున ఒక ప్రకటన లో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ మొదటి, రెండవ డోసులు వేయబడతాయి. కోవ్యాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండు అందుబాటులో ఉంటాయన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారు, మరియు వయస్సుతో సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలు, 5సంవత్సరాల వయసు లోపు పిల్లలు కలిగిన తల్లులు, విద్యాశాఖలో పని చేయుచున్న ఉపాధ్యాయలు, అంగన్ వాడీ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలియజేశారు. మొదటి డోసు వేయించుకున్న వారందరూ రెండవ డోసు వేయించుకొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పైన సూచించిన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని జిల్లా కలెక్టరు తెలిపారు.