ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి..
Ens Balu
1
Visakhapatnam
2021-08-12 15:43:05
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు విశేషంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సిబ్బందిని ఆదేశించారు. గురువారం నగరంలోని వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సాగర్ నగర్ -1,సాగర్ నగర్ -2 వార్డు సచివాల యాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది విధులపట్ల అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్ ను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. డేటా ప్రాసెసింగ్, టౌన్ ప్లానింగ్,సంక్షేమం,పరిపాలన,శానిటేషన్, మహిళ పోలీస్ తమ విధులను ఖచ్చితంగా నిర్వహించా లన్నారు. ప్రజల ఇచ్చే ఫిర్యాదుల పై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తెలియ జేయాలన్నారు.