ఏపీఐఐసి, ఎన్ఎఓబీ, నక్కపల్లి, ఎన్ హెచ్ -16, పాడేరు గ్రీన్ క్యారిడార్ , ఆర్ అండ్ ఆర్, నిర్వాసితులకు గృహ నిర్మాణాలు తదితర అంశాలు, భూ సమస్య ల కు సంబంధించిన పనులను వేగ వంతంగా పూర్తి చేయాల్సింది గా జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు, విశాఖపట్నం,అనకాపల్లి,నర్సీపట్నం, ఆర్డీఓ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,ఏపీఐఐసి అధికారులతో ,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల తహశీల్దార్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఏ పీ ఐ ఐ సి , ఎన్ ఏ ఓ బీ, ఎన్హెచ్ 16 భూములకు సంబంధించి పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. వాటికి సంబంధించి ఏమైనా ప్రతి పాదనలు ఉంటే వెంటనే పంపించాలన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట, అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రభుత్వ, మరియూ జిరాయితీ భూముల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. బీచ్ కారిడార్, రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లోఉన్న పనులను వేగవంతం గా పూర్తి చేయాల్సింది గా ఆదేశించారు.అనకాపల్లి, మునగ పాక, అచ్యుతాపురం రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి అబ్జెక్షన్స్ పై డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. పైన తెల్పిన అంశాల పురోగతి పై ప్రతీ నెల సమీక్ష నిర్వహిస్తామనీ, సంబంధిత అధికారులు,సిబ్బంది పనుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశం లో జాయింట్ కలక్టర్ ఆర్ గోవింద రావు, ఆర్డీవో లు పెంచల కిషోర్,సీతా రామా రావు,అనిత,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగయ్య, ఏపీఐఐసి జెడ్ ఎమ్ యతిరాజులు, మినిష్టరీ ఆఫ్ రోడ్ సేఫ్టీ పీ డి రవి షేక్, ఇతర అధికారులు హాజరయ్యారు.