ప్రజలకు ఇబ్బందిలేకుండా పూడికలు తీయాలి..


Ens Balu
4
Anantapur
2021-08-12 16:06:01

అనంతపురంలో మరువ వంక పూడికతీత పనులను నగర మేయర్ మహమ్మద్ వసీం గురువారం పరిశీలించారు. నగరంలోని మూడవ డివిజన్ పరిధిలోని మరువ వంకలో పూడిక పెరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహం ముందుకు సాగక ఆ ప్రాంతంలో దుర్గంధం నెలకొందని స్థానికులు ఇటీవల మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. దీనితో మరువ వంక పూడికతీత కు టెండర్లు నిర్వహించి రూ.7.80 లక్షల వ్యయంతో పనులు చేపట్టారు.పనులు జరుగుతున్న తీరును మేయర్ వసీం అధికారులను,కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట కార్పొరేటర్ బాలాంజినేయులు, వైకాపా నాయకులు కృష్ణమూర్తి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.