భారత స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మాంసాహార విక్రయాలను ఆదివారం నిషేదించినట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా జివిఎంసి పరిధిలోని అన్ని మాంసము, చేపలు, రొయ్యల మార్కెట్లు తదితర మాంసాహారం విక్రయించే దుకాణాలు మూసివేయాలన్నారు. ఈవిషయంలో ప్రజలు, దుకాణదారులు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ మాంసం విక్రయాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రధాన వైధ్యాధికారిని, జోనల్ కమిషనర్లను, సహాయ వైధ్యాధికారులను కమిషనర్ ఆదేశించారు. తెరిచిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆ ప్రకటనలో కోరారు.