అవయవ దానంతో ప్రాణదాతలు కండి..


Ens Balu
2
విశాఖపట్నం
2021-08-13 17:31:53

అవయవ దానం చేసి మరో వ్యక్తికి ప్రాణదానం చేయాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రజలకు పిలుపునిచ్చారు.  శుక్రవారం “ప్రపంచ అవయవదాన దినోత్సవ” సందర్భంగా విమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొని మాట్లాడుడారు. అవయవ దానం మహత్తరమైన దానమని, సందర్భానుసారంగా అన్నదానం, విద్యాదానం చేయడానికి ముందుకి రావాలన్నారు. వీటన్నింటికి మించిన ఫలితాన్ని అవయవదానం పొందవచ్చునన్నారు.  బ్రతికుండగానే పదిమందికి సాయం చేసిన మనిషి, మరణాంతరం కూడా మరొకరికి పునర్జన్మ ఇచ్చే అవకాశం అవయవదానం కల్పిస్తుందన్నారు. ప్రతిఒక్క సామాన్యుడు సైతం మానవత్వంతో ఆలోచిస్తే మరణం చేరువులో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించ వచ్చునని, అలాంటి అద్భుత అవకాశం, మహా  భాగ్యం అవయవదానం సొంతం అని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పలు రకాల అపోహలు అవగాహన లేని కారణంగా ఆశించినంత మేర స్పందన రావడం లేదన్నారు. మరణానంతరం మన అవయవాలను మరొకరికి దానం చేసినందువలన వారికి ప్రాణం పోసిన వారం అవుతామని, వారి కుటుంబంలో వెలుగు నింపిన వారం అవుతామని, అందుకు ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలని, ఎటువంటి మూఢ నమ్మకాలకు, అపోహలకు పోకుండా, యువత ముందుకు రావాలని మేయర్ పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డా. రాంబాబు, అవయవ దాన అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.