గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..
Ens Balu
6
Srikakulam
2021-08-13 17:38:25
శ్రీకాకుళంజిల్లాలోని ఇచ్ఛాపురం మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో కృష్ణాపురం, మండపల్లి, తేలుకుంచి, రత్తకన్న తదితర సచివాలయాలను జాయింట్ కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రత్తకన్న, బాలకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గురుమూర్తి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నామని చెప్పారు. కార్యాలయ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, కోవిడ్ ఫీవర్ సర్వే చేపట్టకపోవడం తదితర అంశాలను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సక్రమంగా పర్యవేక్షణ చేయడం పట్ల ఆయనకు మెమో జారీ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.