విజిలెన్స్ పర్యవేక్షణకు ఆహ్వానించండి..
Ens Balu
4
Visakhapatnam
2021-08-13 17:50:07
విశాఖజిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారంతో పాటు విజిలెన్స్ పర్యవేక్షణ సమావేశాలకు తమను ఆహ్వానించాలని ఆంధ్రప్రదేశ్ దేశ్ ఎస్సీ&ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక సంఘం గౌరవ అధ్యక్షులు రంగయ్య, అధ్యక్షులు యజ్జల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ఆర్డీఓ సానుకూలంగా స్పందించారని యూనియన్ నేతలు తెలియజేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లి ఆహ్వానం వచ్చే ఏర్పాటు చేస్తామమని ఆర్డీఓ చెప్పండం ఆనందంగా వుందని యూనియన్ నేతలు మీడియాకి తెలియజేశారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యలను ప్రబుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడంలో యూనియన్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్ఞానవేణి కుంచె, జిల్లా సలహాదారులు శోభ, సందీప్, వాణీమోహన్, సత్యన్నారాయణలు పాల్గొన్నారు.