అప్పన్నకు ఎయిమ్స్ ఆచార్యులు పూజలు..
Ens Balu
5
Simhachalam
2021-08-14 13:00:26
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్న ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా దర్శించుకున్నారు. శనివారం ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం ఈఓ సూర్యకళ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదం అందించగా.. అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కరోనా కష్టకాలంలో పేదలకు మంచి వైద్యం అందించాలని, కొత్త పరిశోధనలు చేసి కొత్త కొత్తగా కరోనాకి విరుగుడు మందులు కనిపెట్టాలని ఆయన అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.