అప్పన్నకు విశాఖవాసి రూ.60001 విరాళం..


Ens Balu
2
Simhachalam
2021-08-14 13:04:39

విశాఖ చటర్జీవారి వీధికి చెందిన మునుబర్తి చైతన్య  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ (సింహాద్రి అప్పన్న)స్వామివారికి 60,001 (అరవై వేల ఒక్క రూపాయి) విరాళం సమర్పించారు. శనివారం ఈ మేరకు చెక్ ను పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్ లో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, అక్షయతృతీయనాడు స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు.  అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి దేవస్థానం అధికారులుప్రసాదం అందజేశారు.