కాకినాడలో పంద్రాగస్టుకి ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
5
Kakinada
2021-08-14 13:09:07
తూర్పుగోదావరి జిల్లాలో 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం ఉదయం కాకినాడ ఆర్డీవో ఏజీ. చిన్ని కృష్ణ ,డీఎస్పీ భీమారావుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చిన్నికృష్ణ మాట్లాడుతూ ఆగస్టు 15న జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,రెవెన్యూ శాఖ మంత్రి ,జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించన శకటాల ఏర్పాట్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆర్డీవో , డీఎస్పీ పర్యవేక్షించారు.