విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానానికి ఆర్ధిక ఇబ్బందులు తొలగించేందుకు త్వరలోనే చర్యలు తీసుంటామన్నారు. ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు కావడం ఆనందంగా వుందన్నారు. కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.