అప్పన్నకు మంత్రి సీదిరి కుటుంభం పూజలు..


Ens Balu
3
Simhachalam
2021-08-14 13:34:05

సింహాచలం  శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో మెట్ల మార్గంలో కొండపైకి మెట్లకు చందనం, పసుపు, కుంకుమ పూసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా వారికి దేవాలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతోపాటు రంజిత్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్  అధినేత అన్నెపు రంజిత్ కుమార్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ర్యదర్శి నంబాల రాజేష్ కుమార్, పలాస వైకాపా సీనియర్ నాయకులు గౌరీ త్యాడి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, దేవాలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.