స్వేచ్ఛా స్వరాలులో ప్రతిభచాటుకుంది..


Ens Balu
8
Vijayawada
2021-08-14 15:18:56

75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని అమరావతి బాలోత్సవం, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన "స్వేచ్ఛా స్వరాలు" పోటీలలో విజయవాడకి చెందిన  కుమారి పుల్లట యుక్త శ్రీ (8) టాప్ ఫైవ్ లో నిలిచింది. వేమన పద్యాలు, దేశ భక్తి గీతాల విభాగాలలో రెండు మెమెంటోలు గెలుచుకుంది.  అమరావతి బాలోత్సవం గౌరవ అధ్యక్షులు సిహెచ్. మల్లికార్జునరావు చేతులమీదుగా యుక్త శ్రీ మెమెంటోలు, ఇంకా ప్రశంసా పత్రాలను అందుకుంది. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహించిన స్వేచ్ఛా స్వరాలు ఆన్ లైన్ పోటీలకు ముఖ్య అతిధిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు హాజరయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.  అరసం నగర కన్వీనర్ పి. అజయ్ కుమార్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.