అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
Ens Balu
7
Kakinada
2021-08-15 12:57:55
75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ మైదానం ఏర్పాటు చేసిన సాంస్క్కుతిక కార్యక్రమాలు ఎంతగానో ఆహుతులను ఆకట్టుకున్నాయి. సెయింట్ ఆన్స్ జగన్ నాయక్ పూర్ సెంయిటాన్స్ ఎయిడెడ్ హైస్కూల్, ఎ.ఎస్.డి. డిగ్రీ కళాశాల, మున్సిపల్ హైస్కూల్, చర్చిస్క్వేర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలలో ఉత్తమ ప్రదర్శన గాను సెయింట్ ఆన్స్ జగన్నాయక్ పూర్, ఎ.ఎస్.డి. డిగ్రీ కళాశాల, మున్సిపల్ హైస్కూల్, చర్చిస్వ్కేర్ విద్యార్థుల ప్రదర్శనలు వరుసగా ప్రధమ ,ద్వితీయ ,తృతీయ బహుమతులు అందుకున్నాయి. ఈ వేడుకలలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్, కలెక్టర్ సి.హరికిరణ్ ,యాస్పీ యం. రవీంద్రనాథ్ బాబు, ఎపిఎస్పి 3వ బెటాలియన్ కమాండెంట్ సుమీత్ గరుడ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులురి దొరబాబు, రాష్ట్ర దృశ్య కళల ఛైర్మన్ కుటికలపూడి శైలజ, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, కుడా చైర్మెన్ చంద్రకళ దీప్తి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి బులిరాజు, జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మీశ, జి.రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అడిషనల్ ఎస్పి కరణం కుమార్, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, కాకినాడ ఆర్డిఓ ఎజి చిన్ని కృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యాక్రమానికి వ్యాఖ్యాతలుగా ఎం.కృష్ణమూర్తి, పి.సుదేష్ణ వ్యవహరించారు.