గుంటూరు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 75 వ స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ దంపతులు తేనెటీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కె.ఎస్. లక్ష్మణ రావు, లేళ్ళ అప్పిరెడ్డి, శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, మెరుగ నాగార్జున, నంబూరు శంకరరావు, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర నాయుడు, టొబాకో ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వి. లక్ష్మణ రెడ్డి, కృష్ణ, బలిజ సంఘం కార్పొరేషన్ చైర్ పర్సన్ కోలా భవాని, అప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తమ్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) కే. శ్రీధర్ రెడ్డి, తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శుభం భన్సాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య ఆలపించిన దేశ భక్తి గీతం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పధకాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు అధిగమించేలా జిల్లా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన చిన్నారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మెమెంటో లను అందజేశారు.