మ్రుతుల కుంబాలకు మంత్రి నష్టపరిహారం..


Ens Balu
3
గార
2021-08-15 16:07:50

శ్రీకాకుళంజిల్లా గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన మత్స్య కార మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం క్రింద ఆదివారం బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు  అందించారు. ఆదివారం బందరువానిపేట గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు పడవ బోల్తా పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారని, ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు మృతి చెందడం మనసుకు ఎంతో బాదకల్గించిందని అవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవితాలు ప్రమాదంలో పడినప్పుడు వారిని ఆదుకునే బాధ్యత జగనన్న ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అందుకే తక్షణ సహాయం క్రింద కుటుంబానికి రూ.5 లక్షలు అందించడంతో పాటు వైఎస్ఆర్ భీమా ద్వారా ఒక్కొక్క కుటుంబానికి మరో 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తొమ్మిది వందల కిలోమీటర్ల పైబడి ఉన్న తీర ప్రాంతంలో గతంలో రెండు పోర్టులు మాత్రమే ఉండేవని కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఒక పోర్టు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుందని అన్నారు. అందుకే రాష్ట్రంలో తొమ్మిది పోర్టుల నిర్మాణం చేపట్టి మత్స్యకారుల అభివృద్దికి పాటుపడుతుందని తెలిపారు. తీరప్రాంతంలో 50 నుండి 100  కిలోమీటర్ల మద్య మత్స్యకారులకు చేపల వేటకు వీలుగా ఫిషింగ్ జట్టీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. చేపల వేట ద్వారా మత్స్యకారులు సేకరించిన చేపలను అమ్మకానికి వీలుగా మార్కెటింగ్ హబ్ లు కూడా తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దని అన్నారు. 

మత్స్యకారులకు నేను ఉన్నాను.. అనే భరోసా కల్పించి గ్రామీణ స్థాయిలో మత్స్య సంపద అమ్మకాలు కొనసాగి మత్స్యకారులకు ఆర్ధికంగా బలోపేతం చేసి మత్స్యకార భరోసా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం అన్నారు. సముద్రంలోకి చేపల వేటకు వెల్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెల్లాలి అని సూచించారు. మృతుని కుటుంబాలకు పరామర్శించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి మీ కష్టాలు తీసుకువెళ్లి మరింత మేలు జరిగేలా చూస్తామని కుటుంబాలను ఓదార్చారు. రాష్ట్రంలో నాలుగు హర్బర్ల నిర్మాణం ప్రారంభం అయిందని, మరో నాలుగు హర్బర్లకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరుచుటకు, ఆర్థిక పరిపుష్టి కల్పించుటకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఫ్లోటింగ్ జెట్టిలు నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. మత్స్యకారులకు భద్రత, భరోసా ఇచ్చుటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
సిఫార్సు