అప్పన్నకు 1500 అమెరికన్ డాలర్లు విరాళం..
Ens Balu
3
Simhachalam
2021-08-16 14:12:43
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారికి అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం ఫెడరిక్ ప్లేస్ కు చెందిన కళ్యాణ్, రమణ్ రావు, అంజనీ శైలజ లు 15 వందల డాలర్లు విరాళంగా ఇచ్చారు. (భారత కరెన్సీలో దాదాపు లక్షా 12 వేలు). ఈ మేరకు సోమవారం ఈ చెక్ ను పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్ లో సమర్పించారు. తమ అబ్బాయి అమోఘ్ పుట్టినరోజైన (జనవరి 23 )సందర్భంగా స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని లేదా విద్యా సంబంధ కార్యక్రమానికి ఖర్చుచేయాలని శైలజ కోరారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, తాము తిరుపతిలోనూ డాలర్లరూపంలోనే విరాళమిచ్చానని, గతంలో ఇండియా వచ్చినప్పుడు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహలక్ష్మీనృసింహస్వామివారికి పదివేలు విరాళమిచ్చానని తెలిపారు అంజనీ శైలజ తెలియజేశారు. అంతకుముందు దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.