రేపటి నుంచి జర్నలిస్టుల నిరాహారదీక్షలు..


Ens Balu
3
Gajuwaka
2021-08-16 14:14:05

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల  వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా విశాఖలోని గాజువాక జర్నలిస్టుల రేపటి నుంచి ఆమరణ నిరాహారదీక్షలకు దిగుతున్నారు. ఈమేరకు సోమవారం అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్టు గాజువాక జర్నలిస్టు అసోసియేషన్ పేర్కొంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉయ్యురు కేంద్రంగా సీనియర్ జర్నలిస్టు సాంబశివరావు  చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా గాజువాక జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు.  విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు మిత్రులంతా రేపు ఉదయం 9 గంటలకు పాతగాజువాక కూడలిలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొనాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత ఇన్ని రకాల నిబంధనలు ఎప్పుడూ జర్నలిస్టులు చూడలేదని ఆరోపించారు. ఏ ప్రభుత్వంలోనూ జర్నలిస్టుల అణచివేత లేదని, ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులు, మీడియా, చిన్న, మధ్య తరహా పత్రికల అణచివేత అక్రిడిటేషన్లు నిలుపుదల చేయడం నుంచి మొదలైందని ఆరోపించారు. ఇలాంటి సమయంలోనే జర్నలిస్టులంతా ఏకం కావాలని యూనియన్ పిలుపునిస్తోంది..