వెంగమాంబకు ఘనంగా పుష్పాంజలి..
Ens Balu
2
Tirumala
2021-08-16 14:37:37
భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు సోమవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జరిగిన వర్ధంతి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ముందుగా శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన ఉదయభాస్కర్‌రెడ్డి, కోనేరు లక్ష్మీరాజ్యం బృందం సంగీత సభ, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తిరుపతికి చెందిన పి.జయంతి సావిత్రి బృందం హరికథ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈఓ విజయసారథి, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత, సూపరింటెండెంట్ జి.నాగమణి, సీనియర్ అసిస్టెంట్ బి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.