శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ ఛైర్పర్సన్ గా కోరాడ ఆశాలత గుప్త మంగళ వారం ప్రమాణ స్వీకారం చేశారు. బాపూజీ కళామందిర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకులు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలకు గౌరవం కల్పించాలని ముఖ్య మంత్రి ఉద్దేశం అన్నారు. శ్రీకాకుళం నగరాన్ని చక్కగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అందరూ సమష్టిగా పనిచేద్దామని ఆయన కోరారు. ముఖ్య మంత్రి జిల్లాకు ప్రాధాన్యతను ఇచ్చి పదవులను వివిధ కులాలకు ఇచ్చారని ఆయన చెప్పారు. పేదల మనస్సుల్లో నిలిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. భావనపాడు పోర్టు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
కిడ్నీ ప్రాంతంలో కిడ్నీ రిసెర్చ్ కేంద్రం ఏర్పాటు, రూ. 7 వందల కోట్లతో శుద్ధ తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి బలమైన పునాది వేస్తున్నారని కృష్ణ దాస్ చెప్పారు. కౌలు రైతుకు రైతు భరోసా కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ సతీమణి ధర్మాన పద్మ ప్రియ, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రెడ్డిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ దుక్క లోకేశ్వర రెడ్డి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బల్లాడ హేమమాలిని రెడ్డి, కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అందవరాపు సూరి బాబు, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, వెలమ, పొందర, శ్రీశయన కార్పొరేషన్ చైర్ పర్సన్ ప్రతినిధులు పంగ బావాజీ నాయుడు, రాజపు అప్పన్న హైమవతి, చీపురు రాణీ కృష్ణమూర్తి, ఆరంగి మురళి, నగర కళింగ కోమటి మహిళ అధ్యక్షురాలు కిల్లంశెట్టి ధనలక్ష్మి, సురంగి మోహన రావు, కోణార్క్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.