హౌసింగ్ నిర్మాణ పనుల్లో పురోగతి పెరగాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-08-17 14:49:43
గృహనిర్మాణ పనులకు సంబంధించి ప్రతి వారం పురోగతి కనిపించాలని, ఇంకా గ్రౌండింగ్ కాని గృహనిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ .డా. ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ప్రతి వారం నిర్వహించే సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల లే అవుట్లలో మౌళిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. బేస్ మెంట్ లెవెలింగ్, ఇంటర్నల్ రోడ్లు, బోర్ వెల్స్, నీటి సరఫరా, విద్యుత్తు తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. హౌసింగ్ ఇన్ స్పెక్టర్లు ఎప్పుటి కప్పుడు క్షేత్ర స్థాయి తనిఖీలు చేయాలన్నారు. లే అవుట్ లలో గృహాలు నిర్మించుకొనే విధంగా లబ్దిదారులను ప్రోత్సహించి ప్రోగ్రస్ పెంచాలన్నారు. లే అవుట్ లకు సంబందించి ఎక్కడైనా వివాదాలు ఉంటే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రూరల్ హౌసింగ్ కు సంబందించి ప్రతిపాదనలను వారాంతంలో గా పూర్తి చేయాలన్నారు. ఇసుక, ఇనుము, సిమెంటు అవసరం మేరకు ముందుగానే ఇండెంట్ పెట్టాలన్నారు. మెటీరియల్ ను పెట్టడానికి గొడౌన్ లను సిద్దం చేసుకోవాలన్నారు. టిడ్కో గృహాలకు సంబందించి మంజూరైన యూనిట్ లు అన్నింటికి మౌళిక వసతులను కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ .గోవిందరావు, హౌసింగ్, డ్వామా పిడిలు ఎం . శ్రీనివాసరావు, సంధీప్, ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ రాజ్, టిడ్కో ఎస్ ఇ లు రవికుమార్, సుధాకర్ రెడ్డి, కుమార్, జి.వి.ఎం .సి, ఆర్ అండ్ బి, ఇ పి డి సి ఎల్ శాఖల అధికారులు హాజరయ్యారు.