ఆర్ బి కె ల ద్వారా ఎరువులు, పురుగుమందులను రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖకు సంబందించి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, పంటల యొక్క స్థితిగతులపై మండల వ్యవసాయ అధికారులు రోజు వారి జాగ్రత్తలపై రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. రైతుల పంటలకు సంబందించి ఈ క్రాప్ బుకింగ్ ను ఖచ్చితంగా నమోదు చేయాలని అదే విధంగా ఈ కె వై సి కూడా త్వరితగతిన ముగించాలన్నారు. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయం పై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధకం, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖలలో జరుగుతున్న పనుల ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, వ్యవసాయ శాఖ జె డి లీలావతి, పశుసంవర్ధకం, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖల జాయింట్ డైరక్టర్లు, ఇతర అధికారులు హాజరైయారు.