గాజువాక జర్నలిస్టులకు మద్దతుగా APUWJ
Ens Balu
4
Gajuwaka
2021-08-17 15:25:42
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహారదీక్షకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ విశాఖ రూల్ కమిటీ సంఘీభావం తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులను పరామర్శించింది. వారికి సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొంది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడలు పసుపులేటి రాము, రూరల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ బీఎల్ స్వామిలు పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరికీ పాత నిబంధనల ప్రకారమే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న మధ్య తరగతి పత్రికలకు జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పెద్ద పత్రికలు, మీడియా మాదిరిగా అన్ని రకాల పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అడిక్రిడేషన్ కమిటీ సభ్యులు చంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు, గాజువాక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.